మతశక్తులకు కాంగ్రెస్‌కు ఊతం: ఏచూరి
కోజికోడ్: దేశంలో మతశక్తులు పెరిగిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మతతత్వ శక్తుల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరమని ఉద్ఘాటించారు.
ఏచూరి శనివారమిక్కడ ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని మతతత్వ ముప్పు నుంచి కాపాడాలంటే.. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు. ఢిల్లీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖా రీ కాంగ్రెస్‌కు మద్దతు పలకడాన్ని ఏచూరి ఎద్దేవా చేశారు. ఇదే వ్యక్తి 2004 ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు పలకగా బీజేపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు.