సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సుమారు 17 రోజుల పాటు సాగిన సాధారణ ఎన్నికల ప్రచార పర్వానికి సో మవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. పాదయాత్రలు, రోడ్‌షోలు, వీధి మలుపు సమావేశాలు, బహిరంగ సభలతో హోరెత్తించిన ప్రధాన పార్టీలు చివరి రోజు ప్రచారంలో సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. 17 రోజులగా జరిగిన ప్రచార తీరు తెన్నులను సమీక్షించుకుంటున్న అభ్యర్థులు ప్రచార లోపాలను సరిదిద్దుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
మండలాలు, గ్రామాల వారీగా తాము ఇంకా వెళ్లాల్సిన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు ప్రచారంలో చివరి రోజు భారీగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన ఎన్నికల్లో ప్రచార పర్వంలో వెనుకబడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే ఎన్నికల వ్యయం తడిసి మోపెడు కావడంతో చివరి రెండు రోజులు అప్రమత్తంగా ఉండక పోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు భయాందోళనలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు సొంత బలంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపైనే ఆధార పడి విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల ప్రలోభాల పర్వం మొదలు కాావడంతో చివరి రోజు ప్రచారంలో సత్తా చాటేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చివరి రోజు జరిగే ప్రచారం శైలి మరో 48 గంటల్లో జరిగే పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.
‘పెద్ద’లను రప్పించిన పార్టీలు
ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలను రప్పిం చడం ద్వారా ప్రచార పర్వాన్ని రగిలించే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ పక్షాన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 21న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మరుసటి రోజు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మో డీ కూడా మహబూబ్‌నగర్ సభలో ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మూడు విడతలుగా నియోజకవర్గంలో పర్యటించి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
ఇతర పార్టీల కంటే టీఆర్‌ఎస్ ను ప్రచార పర్వంలో ముందు నిలిపే ప్ర యత్నం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోడీతో పాటు మహబూబ్‌నగర్‌కు రాగా, అచ్చంపేట, ఆలంపూర్, జడ్చర్ల సభల్లో పాల్గొన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి పక్షాన చంద్రబాబు తనయుడు లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జవదేకర్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు. కాం గ్రెస్ తరపున జైరాం రమేశ్, కొప్పుల రాజు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాకు రప్పించేందుకు నేతలు ప్రయత్నించినా సమయాభావంతో రాలే క పోయారు. మొత్తంగా మరో కొద్ది గం టల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు చివరి ప్రయత్నం చేయడంలో మునిగి తేలుతున్నారు.
ష్...గప్‌చుప్
Published Mon, Apr 28 2014 3:29 AM | Last Updated on Thu, Aug 30 2018 5:38 PM
Advertisement
Advertisement