సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుత్తలూరు మండలం ఏరుకోలులో ఏర్పడ్డ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది.
నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుత్తలూరు మండలం ఏరుకోలులో ఏర్పడ్డ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఏరుకోలులో దాంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడకు మోహరించారు. అయితే పోలీసులపై దాడి చేసి, పోలీస్ జీపును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు.
ఇక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. మండలంలోని ఏరుకొల్లులో 108వ పోలింగ్ బూత్ వద్ద నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేసి పలువురిని గాయపడిచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు వృద్ధులు, మధ్య వయస్కులను పోలింగ్ బూత్లోకి తీసుకొచ్చి వారే ఓటు వేస్తుండటంతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు.
ఈ విషయమై పోలింగ్ బూత్ వెలుపల వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం నడిచింది. ముందస్తు ప్రణాళికతో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్ఆర్ సీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీకి చెందిన చేజర్ల శ్రీనివాసులరెడ్డి, షేక్ హజరత్ తలలకు బలమైన గాయాలయ్యాయి.