కాంగ్రెస్ చీకటి పాలనకు స్వస్తి పలుకుదామని.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.
కొరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ చీకటి పాలనకు స్వస్తి పలుకుదామని.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు పట్టణంలోని పాత బజారులో ఉన్న గంగమ్మమిట్ట వద్ద శనివారం పార్టీ నాయకులతో కలిసి గ్రామ దేవత గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామిగుడివీధి, పాత బజారు తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. కొరముట్ల మాట్లాడుతూ రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని.. ఈ సారి కూడా గెలిపిస్తే కోడూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. వైఎస్ పథకాలు అమలుకావాలంటే జగన్‌తోనే సాధ్యమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో అమలుతో రాష్ట్ర దశ, దిశ మారుతుందన్నారు.
కాంగ్రెస్, టిడిపిలు ఒక్కటై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే దానికి బీజేపి మద్దతు పలకడం దురదృష్టకరం అన్నారు. అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుకే ఉందన్నారు. పార్టీ నాయకులు అన్వర్‌భాషా, కౌరెడ్డి సిద్దయ్య, పట్టణ కన్వీనర్ సిహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, ముజీబ్, జిల్లా బీసీ సెల్ స్టీరింగ్ కమిటి సభ్యులు నందాబాలా, ఈ.మహేష్, జిల్లా ఎస్సీసెల్ స్టీరింగ్ కమిటి సభ్యులు మహేష్‌బాబు, కె.సుబ్రమణ్యం, మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, వైఎస్ కరిముల్లా, జిల్లా మహిళా విభాగం నాయకురాలు రాజేశ్వరి, డిటియు సెక్రటరి సుబ్రమణ్యంరెడ్డి, సేవాదళ్ మండలాధ్యక్షుడు వై.రత్నయ్య, వార్డు మెంబర్లు సుదర్శన్‌రాజు, సావిత్రి, రమణయాదవ్, పార్టీ నాయకులు మహ్మద్ రఫి అక్బర్, ఎం.శివయ్య, చలపతి, రాజారావు, ఎం.శ్రీను, రాజా, చంగల్రాయుడు, నాగమణి, సరస్వతి, వెంకటయ్య పాల్గొన్నారు.