హుజూర్‌నగర్,న్యూస్‌లైన్ సార్వత్రిక, స్థానిక ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం మఠంపల్లి మండలం బీల్యానాయక్‌తండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు సు మారు 50 కుటుంబాలు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ పాలకులు ప్రజా సమస్యలను పక్క కు పెట్టి అధికారమే పరమావధిగా పదవులను అనుభవిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అవినీతి కుంభ కోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రోజున ప్రజలంతా సంబరపడ్డారంటే కాంగ్రెస్ పాలన పట్ల ఎంత విసుగు చెందారో తెలిసిపోయిందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నియంతృత్వ పాలన కొనసాగిం చిన కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లాగా కృ షి చేయాలన్నారు.
పార్టీలో చేరిన వారిలో ధరావత్ శంకర్‌నాయక్, వాంకుడోతు హనుమానాయక్, బాబూనాయక్,పున్నానాయక్, హేమానాయక్, హుస్సేన్‌నాయక్, భీక్యానాయక్, చందునాయక్, జహీందర్‌నాయక్, రామానాయక్,రవినాయక్, కృష్ణానాయక్, బాలునాయక్, నాగా నాయక్, చంటినాయక్, ప్రసాద్‌నాయక్, శంకర్ నాయక్, మౌలాలీ నాయక్,సైదానాయక్, కస్నానాయక్,గోవింద్‌నాయక్, బజ్జు నాయక్, కృ ష్ణానాయక్, నాగునాయక్ తదితరులున్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పాదూరి కరుణ, నాయకులు ధరావత్ సీత్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి
Published Mon, Mar 24 2014 1:35 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement