ప్రజల కోసం బాబు ఏనాడూ పనిచేయలేదు | chandra babu naidu didnot work for the sake of people, says ys vijayamma | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం బాబు ఏనాడూ పనిచేయలేదు

Published Tue, Mar 18 2014 6:02 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ప్రజల కోసం బాబు ఏనాడూ పనిచేయలేదు - Sakshi

ప్రజల కోసం బాబు ఏనాడూ పనిచేయలేదు

రైతుల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన 'వైఎస్ జనభేరి'లో ఆమె పాల్గొని ప్రసంగించారు. 86 ప్రాజెక్ట్‌లు చేపట్టి రాష్ట్రమంతటికీ తాగునీరు ఇవ్వాలని వైఎస్ ఆకాంక్షించారని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, 34 ఏళ్ల రాజకీయ జీ వితంలో చంద్రబాబు ఏనాడూ పేద ప్రజల కోసం పనిచేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్‌ను కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు.

సమైక్యాంధ్ర కోసం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాజీ లేని పోరాటాలు చేశారని, చిత్తశుద్ధితో దీక్షలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ ఆశయాలు సాధించేది జగన్‌ మాత్రమేనని చెప్పారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్‌సీపీకి ఓటేయ్యాలని ప్రజలను వైఎస్ విజయమ్మ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement