వెన్ను నొప్పి, ఆస్తమాలకు పరిష్కారం...సుప్త వజ్రాసనం
వ్యాయామం
ముందుగా రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అర చేతులను తొడల మీద బోర్లించాలి(వజ్రాసనంలో).
ఇప్పుడు నిదానంగా వెనక్కి వంగుతూ రెండు మోచేతులను ఒక దాని తర్వాత ఒకటి నేల మీద ఆనిస్తూ దేహాన్ని పూర్తిగా నేల మీదకు వాల్చాలి. రెండు చేతులను మడిచి అరచేతులను తలకింద ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్ల మధ్య నాలుగు వేళ్ల ఖాళీ ఉండాలి. పిరుదులు రెండు మడమల మీద ఆని ఉండాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు చేస్తుంటే...
ఆస్తమా, బ్యాక్‌పెయిన్‌ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి
థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది.
గొంతుసమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది.
తొడలలో చేరిన కొవ్వును కరిగిస్తుంది.
జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు, కొత్తగా చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.