బూచాడు...బూచమ్మ రారిక!
అర్థరాత్రి భయంకరమైన పీడకల...భయంతో మెలకువ వచ్చింది... గది మొత్తం చీకటి. నిద్ర పట్టడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మీ పడక గదిలో డ్రీమ్ క్యాచర్ని పెట్టుకోండి. ఇది ఉంటే నిద్రలో ఎలాంటి పీడకలలు రావట. ఇది అమెరికా ప్రజల నమ్మకం. ఈ డ్రీమ్ క్యాచర్లు ప్రస్తుతం విశాఖ నగరానికి కూడా పరిచయం అయ్యాయి.
సాలెగూడును పోలి ఉండే డ్రీమ్ క్యాచర్కు విచిత్రమైన బొమ్మలు వేలాడదీసి నిద్రపోతే పీడకలలు ఆ సాలెగూడులో చిక్కుకుని మంచి కలలు మాత్రమే వస్తాయట. పూర్తిగా చేతి తయారీ అయిన వీటిని నగరంలో అందుబాటులో ఉన్నాయి.