ఇంటిపంటల పందిరి నీడన పద్మావతి
బాల్యంలో చేసిన పనులు ఎప్పటికీ మదిలో నిలిచి ఉంటాయి. అటువంటి జాబితాలో ఇంటిపంటల సంగతి కూడా ఒకటి. అమ్మతో కలిసి తన బాల్యంలో పెరటి తోటలు సాగు చేసిన అనుభవం కొలను పద్మావతి గారిని మేడపై ఇంటిపంటల సాగుకు పురికొల్పాయి. సికింద్రాబాద్ నేరేడ్‌మెట్ కృప కాంప్లెక్స్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె.. రైల్వే హిందీ అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల మీద ఆసక్తి ఉన్నప్పటికీ చాలా కాలం అడుగు ముందుకు పడలేదు.ఫేస్‌బుక్‌లో తమిళనాడు టెర్రస్ గార్డెన్ గ్రూపు తారసపడడంతో కొత్త ఉత్సాహం వచ్చింది.
ఇంటిపంటల నిపుణులు కర్రి రాంబాబు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి మాట సాయంతో ఆమె రెండేళ్ల క్రితం నుంచి ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. వేదభవన్ గోశాల నుంచి ఆవు పేడ తెచ్చుకొని చెరువు మట్టి, కొబ్బరిపొట్టును కలిపి.. సిమెంటు కుండీలు, ప్లాస్టిక్/సిల్పాలిన్ కవర్లు/బెడ్స్‌లో వంగ, టమాటా తదితర కూరగాయలు, ఆకుకూరలు, పూలు సాగు చేస్తున్నారు. నేలలో వేసిన సొర పాదును గతంలో మేడ మీద పందిరిపైకి పాకిస్తే.. 40 వరకు సొరకాయలు కాశాయని పద్మావతి(99898 39950) సంతోషంగా చెప్పారు.
టమాటా మొక్క, ఆకుకూరలు
Comments
Please login to add a commentAdd a comment