
నేడు స్కై లాంతరు ఫెస్టివల్-2014
నేత్రదానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్సార్ నిథమ్, జియో మెరిడియన్, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా గురువారం ‘స్కై లాంతరు ఫెస్టివల్-2014’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పేద విద్యార్థుల కోసం నిధుల సమీకరణలో భాగంగా బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ వీజేఐఈటీ క్యాంపస్‌లో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
సినీనటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరవైవేల స్కైలాంతర్లను ఆకాశంలోకి వదలనున్నారు. ఒక్కో లాంతరుకు రూ.100 చెల్లించి పేదలకు సాయం చేయడంలో అందరూ తోడ్పడాలని నిర్వాహకులు కోరారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ సంస్థ విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఇతర వివరాల కోసం 7842455581, 9989904305 నంబర్లకు సంప్రదించవచ్చు.
- రాయదుర్గం