
ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..!
డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న చిత్రంలో బిపాసా బసు హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. బిపాసా నటించిన చాలా చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన ఫడ్నిస్‌కు ఆమెతో సన్నిహిత పరిచయుం ఉంది. ఆ చనువుతోనే తన సినిమాలో హీరోరుున్‌గా నటించమని కోరాడని, ఆమె కూడా అందుకు అంగీకరించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ఆస్ట్రేలియూలో ప్రారంభం కానున్నట్లు ఫడ్నిస్ సన్నిహితుడు ఒకరు చెప్పారు.