పదును పెట్టాలా?!
రోజువారీ పనుల్లో చాకు చాలా అవసరం. కూరగాయలు కోయాలన్నా, పండ్లను ముక్కలు చేయాలన్నా చాకే మన ఆయుధం. అయితే అది కసకసా తెగాలి. లేదంటే మన సమయమంతా వృథానే. కానీ కొన్నాళ్లు వాడాక ప్రతి చాకూ మొద్దుబారిపోతుంది. అప్పుడేం చేస్తారు? పారేసి కొత్తది కొనుక్కుంటారా? అయితే మీరు డబ్బును వృథా చేస్తున్నట్టే లెక్క. దీన్ని చూడండి... ‘నైఫ్ షార్ప్‌నర్’ అంటారు దీన్ని. ఇది ఇంట్లో ఉంటే చాకులు పారేయాల్సిన పని లేదు.
మొద్దుబారిన చాకును ఈ షార్ప్‌నర్ మీద పెట్టి కాసేపు రుద్దితే చాలు... బాగా పదునెక్కుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా పదును పెట్టుకోవచ్చు. కాబట్టి అస్తమానం కొత్త చాకులు కొనే బదులు ఒకే ఒక్కసారి దీన్ని కొనుక్కోండి. దీని వెల 150/- రూపాయలు. ఆన్‌లైన్లో అయితే 124/- రూపాయలకి కూడా వచ్చేస్తోంది.