జనాభా వరమా? శాపమా? | UNO Gives Suggestions To India On Seven Million Campaign | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 11 2018 1:39 AM | Last Updated on Wed, Jul 11 2018 1:39 AM

UNO Gives Suggestions To India On Seven Million Campaign - Sakshi

ప్రపంచ జనాభా మొత్తంగా అదుపూ అడ్డూ లేకుండా పెరిగిపోతోంది. అవసరాలు తీర్చే వన రులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతు న్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి,  సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవ డాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కో వాల్సిందే అని ఇటీవల వినిపిస్తున్న ఘోష.

జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివలన లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికి అదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలు న్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా? పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? వంటి అంశాలను  ప్రపంచానికి తెలియజేయడా నికే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిందని జన గణన సంస్థలు ప్రక టించాయి. చరిత్రలో ఈ తేదీ గుర్తుగా ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్ణయించాయి కూడా. ఆపై కొద్ది కాలంలోనే ప్రపంచ జనాభా 2011 అక్టోబర్‌ 11 నాటికి 700 కోట్లకు చేరింది.
 
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ ప్రభంజనంగా మారనుంది. అత్యధిక శ్రామిక శక్తిగా, ఉత్పాదక శక్తిగా అవతరించబోనుంది. ప్రపంచ జనాభాను పరిశీలిస్తే 700 కోట్ల సంఖ్య మన దేశానికే దక్కడం మరో విశేషం. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ ఆడ శిశువు ‘బేబీ సెవెన్‌ బిలియన్‌’గా పేరు కెక్కింది. ప్రపంచ జనాభాలో 17.5 శాతం వాటా మనదే. ప్రస్తుతం జనాభా విషయంలో చైనా (సుమారు 134.4 కోట్లు) తరువాత 121 కోట్ల పైచిలుకు జనాభాతో 2వ స్థానంలో ఉన్నాము. 2050 నాటికి భారత్‌.. చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా అవతరిస్తుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం మన జనాభాలో 50 శాతం 25 ఏళ్లలోపు వాళ్లు కాగా, 35 ఏళ్లలోపు వాళ్లు 65 శాతంగా ఉన్నారు. 2030 నాటికి అత్యధిక యువ శక్తిగల దేశం భారతదేశమే అవుతుంది.

మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్‌ బిలియన్‌ క్యాంపెయిన్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1. దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపు చేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆరోగ్యకర మైన కుటుం బాలకు దారి సుగమం చేయడం. 3 తక్కువ సంతానం, దీర్ఘాయుష్షుల వలన వృద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం. జూలై 11, 2018న ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, ఇంకా వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవ హక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది. 

భారతదేశం అతి త్వరలో అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరించబో తోంది అని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆనాడే అన్నారు. ఆయన మానస పుత్రిక అయిన ‘గ్రామ స్వరాజ్యం’ కోసం పలు ప్రణాళికలను రూపొందించారు. ప్రభుత్వాలు కూడా వాటిని కొద్ది మార్పులతో ఆచరణలోకి తెచ్చాయి. తన సొంత ఖర్చుతో జాతీయ పాఠశాలలు, వినియో గదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు వంటి వాటిని ఏర్పర్చి ప్రకాశం గారు చేసిన కృషిని మహాత్మాగాంధీ ప్రశంసిస్తూ అవి దేశప్రగతికి నిదర్శనాలని కితాబు ఇచ్చారు. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రత్యేకించి యువతరాన్ని ఉత్తేజపరచనుంది. తమ ఆరోగ్యం, శరీర పుష్టి, లైంగిక సమస్యలు వంటివాటిపై యువత సరైన నిర్ణయాలను తీసుకోగలిగేలా ప్రేరే పించడమే నేటి జనాభా దినోత్సవం లక్ష్యం. 
వ్యాసకర్త: టంగుటూరి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ

మొబైల్‌ :
99514 17344

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement