హైదరాబాద్: గోదావరి పుష్కర పనులను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దీనిలో భాగంగా నేడు(శనివారం) ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉద్యోగ సంఘాలతో భేటి అనంతరం సీఎం గోదావరి పుష్కరాల పనులను పరిశీలించడానికి బయలుదేరారు. మంగళవారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కర పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజమండ్రిలో సాయంత్రం వరకు పర్యటించి అధికారులతో సమీక్షించనున్నారు. ఆ తర్వాత కొవ్వురు వెళ్లనున్నారు.