బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశభక్తి గల పార్టీ అని తెలిపారు. హెచ్సీయూ ఘటనలో బీజేపీని దోషిగా నిలబెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశద్రోహులతో రాహుల్ గాంధీ చేతులు కలిపారని ఆరోపించారు.