అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.
కర్నూలు : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. శనివారం ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకే వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ ఇప్పుడు ఇంటికో ఉద్యోగం పీకేస్తున్నారని ఆమె వెల్లడించారు.