హైదరాబాద్: హైదరాబాద్‌లోని రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన 10కే రన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. రెండ్రోజులపాటు మారథాన్‌లో భాగంగా నిన్న 5కే రన్ ఉత్సాహంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ రోజు కూడా హైదరాబాద్‌లో 10కే రన్ మారథాన్ కార్యక్రమం హైటెక్స్ నుంచి గచ్చిబౌలి వరకు 10కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. ఈ మారథాన్ కార్యక్రమంలో యువతీ యువకులతో పాటు పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ పై అవగాహన కలిగించేందుకు 10కే రన్ కార్యక్రమంలో ఎంతో ఉల్లాసంగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ మారథాన్ సందర్భంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉత్సాహంగా 10కే రన్ మారథాన్
Published Sun, Aug 28 2016 7:59 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
Advertisement
Advertisement