HYD: పీపుల్స్ ప్లాజా నుంచి మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి మారథాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇక, ఈ మారథాన్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు కొనసాగనుంది. ఈ మారథాన్‌లో పలు రాష్ట్రాల రన్నర్లు పాల్గొన్నారు.అయితే, మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ మారథాన్(42 కి.మీ) పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్, రోడ్డు నం 45, కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, మైహోం అబ్రా, ఐకియా రోటరీ, ట్రాన్స్‌కో, బయోడైవర్సిటీ, జంక్షన్, టెలికాంనగర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ క్యాంపస్ గేట్ నం-2 నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.The Traffic Advisory 13th Edition Hyderabad Marathon—2024 will be held on 25.08.2023 (Sunday) between 5.00 AM and 12.30 PM. The event takes place on various roads in the city starting from People’s Plaza, Necklace Road and Hitex Exhibition up to Gachibowli Stadium. pic.twitter.com/Pon7hXglZA— Cyberabad Police (@cyberabadpolice) August 24, 2024