రాష్ట్రంలో మరో 2 పాలిటెక్నిక్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 2 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ప్రారంభమవనున్నాయి. సికింద్రాబాద్, హుస్నాబాద్‌లలో వచ్చే విద్యా సంవ త్సరం (2017–18) నుంచి అందుబాటులోకి రానున్నాయి. గతంలోనే కాలేజీలు మంజూరైనా భవన నిర్మాణం, ఇతర సదుపాయాలు పూర్తి కాకపోవ డంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తరగతుల నిర్వహణకు అనుమతివ్వ లేదు. ప్రస్తుతం పనులన్నీ పూర్తవడంతో.. ప్రవేశా లకు అనుమతివ్వాలని ఏఐసీటీఈకి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమైంది.
మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలీసెట్–2017ను ఏప్రిల్‌లోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షలో ఈసారి ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను ప్రవేశపెడుతోంది. పాలిటెక్నిక్‌ను విద్యా ర్థులు ఇంగ్లిష్‌లోనే చదవాల్సి ఉండటం, సాంకేతిక విద్యను అభ్యసించే వారికి రాష్ట్ర చరిత్రపైనా అవగా హన ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రంపై ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది.