- దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్
- ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఆగకుండా18,000 కి.మీ. ప్రయాణించగలదు
- గరిష్టంగా 640టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
- విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శంషాబాద్: ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఆంటోనోవ్ ఏఎన్-225 మైరియా’ కార్గో విమానం భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగిడింది. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీనిని ల్యాండ్ చేశారు. 240 ప్రపంచ రికార్డులు కలిగిన ఏన్-225 రాకతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లో తయారైన 117 టన్నుల బరువైన పవర్ జనరేటర్‌ను తుర్క్‌మెనిస్థాన్‌లోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఈ విమానం తీసుకెళుతోంది. 24 గంటల విశ్రాంతి అనంతరం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరనుంది. ఇండోనేషియాలోని జకార్తాలో మరోసారి విశ్రాంతి తీసుకుని.. ఆదివారం పెర్త్‌కు చేరుకోనుంది.
- ప్రపంచంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న అతిపెద్ద రవాణా విమానం ఇదే.
- ఆరు టర్బో ఇంజన్‌లతో పనిచేస్తుంది. ఆరుగురు సిబ్బంది నియంత్రిస్తారు.
- గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
- విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.
- దీని ఎత్తు 18.1 మీటర్లు. అంటే ఆరు అంతస్తుల భవనంతో సమానం.
- ఆకాశంలో 11 కిలోమీటర్ల ఎత్తులో గరిష్టంగా గంటకు 850 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు.
- ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఎక్కడా ఆగకుండా 18,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు
- రవాణా చేసే కార్గో బరువును బట్టి ఇంధనాన్ని తగ్గిస్తారు.
- సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు.. దానిలో భాగమైన ఉక్రెయిన్‌లో 1980 దశకంలో ఈ భారీ విమానం తయారీని ప్రారంభించారు.
- అసలు దీనిని తయారు చేసింది మాత్రం సరుకు రవాణా కోసం కాదు.. సోవియట్ స్పేస్ షటిల్ ‘ది బ్యూరాన్’ను తరలించడం కోసం.
- 1988 డిసెంబర్ 21న ఇది తొలిసారిగా ప్రయాణించింది. కొన్ని కారణాలతో 1994లో పక్కనపెట్టారు.
- 2001లో దీనికి కొత్త ఇంజన్లు అమర్చి, పునరుద్ధరించాక తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది.
- ఆస్ట్రేలియాలో వర్స్‌లీ అల్యూమినా అనే అల్యూమినియం మైనింగ్ సంస్థకు 117 టన్నుల భారీ పవర్ జనరేటర్‌ను రవాణా చేయడానికి అంతర్జాతీయ లాజిస్టిక్స్ (రవాణా) కంపెనీ ‘డీబీ చెంకర్’ ఈ విమానాన్ని ఆంటోనోవ్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది.
- ఈ విమానం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దిగే సమయాన్ని సంబరంగా జరుపుకొనేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- దాదాపు 50 వేల మంది ఈ విమానాన్ని చూడడానికి రానున్నారు. ఇందుకోసం రన్‌వే సమీపంలో ప్రత్యేకంగా వేదికలూ నిర్మిస్తున్నారు.