నగరం శివారులోని మౌలాలీలో ఆదివారం ఆటో - లారీ ఢీ కొన్నాయి.
హైదరాబాద్: నగరం శివారులోని మౌలాలిలో ఆదివారం ఆటో - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలోని స్టీల్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కుషాయిగూడ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.