బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు
బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు
Published Sun, Oct 23 2016 6:47 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
హైదరాబాద్ : రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు వరాలజల్లు కురిపించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆదివారం బ్రాహ్మణ ప్రముఖులు, అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో 10 నంచి 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామన్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ అరవిందరావు తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్రాహ్మణ ప్రముఖులు సీఎం కేసీఆర్ను అభినందించారు.
Advertisement