విరాళాలు ఇస్తామంటూ వచ్చిన దుండగులు ఓ రిటైర్డ్ ఉద్యోగినికి చెందిన ఆరు తులాల నగలు ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి డీఐ పి.బల్వంతయ్య కథనం ప్రకారం.....
చిక్కడపల్లి : విరాళాలు ఇస్తామంటూ వచ్చిన దుండగులు ఓ రిటైర్డ్ ఉద్యోగినికి చెందిన ఆరు తులాల నగలు ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి డీఐ పి.బల్వంతయ్య కథనం ప్రకారం... గాంధీనగర్ బాకారంలో నివసించే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని జి. ఉషాదేవి కొంత కాలంగా దోమలగూడలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్‌గా పని చేస్తోంది. రోజులాగే గురువారం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉషాదేవి వద్దకు పూజమ్ జ్యువెలర్స్ నుంచి వచ్చామని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు.
ఫెడరేషన్‌కు విరాళాలు ఇస్తామని, తమవంతుగా ముం దుగా రూ. 200లు విరాళంగా తీసుకోండని టేబుల్‌పై పెట్టారు. ‘ మా జ్యువెలరీ షాపు బాగా నడవాలని ఆశీ ర్వదించ ండి’ అని ఆమె కాళ్లుపై పడి మొక్కుతున్నట్టు న టించి చేతులకున్న ఆరు తులాల బంగారు గాజులను లాక్కొని పారిపోయాడు. ఆమె పరుగెత్తే లోపు ఇంకో వ్యక్తి బైక్‌పై ఇద్దరూ ఉడాయించారు. బాధితురాలు వెం టనే చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు