సమయం వృథా చేయొద్దు | Do not waste time | Sakshi
Sakshi News home page

సమయం వృథా చేయొద్దు

Published Sat, Sep 9 2017 3:18 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

సమయం వృథా చేయొద్దు - Sakshi

సమయం వృథా చేయొద్దు

- ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచన 
రవీంద్రభారతిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
60 మంది టీచర్లు, రెండు ఉత్తమ పాఠశాలలకు అవార్డులు
 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ సంఘాల పేరుతో టీచర్లు సమయం వృథా చేయవద్దని, ఆ సమయాన్ని పాఠశాలల అభివృద్ధికి వెచ్చించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో సమస్యలపై సంఘాలమీద ప్రభుత్వం, ప్రభుత్వం మీద సంఘాలు విమర్శలు చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. సంఘాలు, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పాఠశాలల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. తెలంగాణలో విద్యాభివృద్ధి బాగుందని ఇటీవల వివిధ రాష్ట్రాల మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రశంసించారని తెలిపారు.

ఈ నేçపథ్యంలో టీచర్లు ఇంకా ఎక్కువ పని చేయాల్సిన బాధ్యత ఏర్పడిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డులు కూడా బాధ్యతను మరింత పెంచాయని, టీచర్లంతా తమ శక్తికి మించి పని చేయాలని కోరారు. శుక్రవా రం రవీంద్ర భారతిలో ఉపాధ్యాయ దినోత్సవ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన 60 మంది టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను, రెండు ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతి తోపాటు ప్రశంసాపత్రం అందజేశారు.

అలాగే రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డులకు ఎంపికైన 37 పాఠ శాలలకు పురస్కారాలను, రూ. 10 వేల చొప్పున నగదు బహుమతిని అంద జేశారు. అంతకు ముందు కడియం శ్రీహరి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగం నిర్వీర్యం అయిందన్నారు. గాడి తప్పిన విద్యా రంగాన్ని గత మూడున్నరేళ్లుగా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవార్డులు వచ్చిన వారే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యా యులు కూడా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అయితే కొంత మంది టీచర్లు సరిగా పనిచేయక పోవడం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోం దని, వారు కూడా బాగా పని చేసేలా ప్రోత్సహిం చాలన్నారు. 
 
మంచి టీచర్లను గుర్తించి అవార్డులు ఇచ్చాం
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోని మంచి టీచర్లను గుర్తించి ప్రత్యేక అవార్డులు ఇచ్చామని కడియం ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మారుమూల మండలం అయిన నర్వలో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థుల నమోదును పెంచిన ప్రధానోపా ధ్యాయుడు విజయ భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక అవార్డు ఇచ్చామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేణుగోపాల్‌ అనే స్కూల్‌ అసిస్టెంట్‌ విధుల్లో చేరిన ప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారని తెలి పారు. ఓ పత్రికలో వచ్చిన ఆ కథనాన్ని చూసి ఆయనకు ప్రత్యేక అవార్డు ఇచ్చామన్నారు. వారిలాగే అనేక మంది ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారని, వారందరి కృషి వల్లే ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. 
 
అన్నింటికీ మూలం విద్య: ఈటల
అన్ని రంగాల్లోకెల్లా విద్యా రంగం చాలా ముఖ్యమైం దని, అన్నింటికీ ఇదే మూలమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గతంలో ఉపాధ్యా యుడు అంటే ఎంతో గౌరవం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత 50 ఏళ్లుగా ఉన్న రుగ్మతలను రూపుమాపే ప్రయ త్నం చేస్తున్నామని, అయితే ఇది ఒక్కరోజులో జరిగే పనికాదని పేర్కొన్నారు. కొంత సమయం తీసుకున్నా.. అనుకున్న పని కచ్చితంగా చేస్తామన్నారు.

గురువుగా పనిచేసిన కడియం శ్రీహరి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండడం విద్యాభివృద్ధికి ఎంతో దోహద పడుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్రం వద్ద తన శాయశక్తులా కృషి చేసి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్‌ వాణీ ప్రసాద్, పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్, ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, పలువురు టీచర్లు పాల్గొన్నారు. 
 
తేదీలు ఇప్పుడే చెప్పను!
త్వరలోనే టీచర్ల భర్తీకి చర్యలు: కడియం
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ ఖాళీల భర్తీ విష యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జాగ్రత్త తీసు కుంటున్నారు. శుక్రవారం జరిగిన ఉపాధ్యాయదినో త్సవ కార్యక్రమంలో.. ఇప్పుడే తేదీలను ప్రకటించనని పేర్కొన్నారు. ఇపుడు తేదీలు చెబితే.. అనుకోని పరిస్థి తుల్లో అది అమలు చేయలేకపోతే ఆ విషయం సోషల్‌ మీడియాలో చర్చకు దారితీస్తుందన్నారు. త్వర లోనే పక్కా విషయాన్ని తెలియజేస్తానని వెల్లడిం చారు. ఈ సందర్భంగా కడియం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘వర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం. జూనియర్‌ కాలేజీల్లోనూ 1,133 పోస్టులను మంజూరు చేశాం.

పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టులను మంజూరు చేసుకుంటాం. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇబ్బం ది కాకుండా వాటిని టీఎస్‌పీఎస్సీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీకి చర్యలు చేపడతాం. విద్యాశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరలోనే శుభవార్త చెబుతాం. ఇపుడొక తేదీ చెబితే.. తరువాత దానిని సోషల్‌ మీడియాలో ప్రతిసారి ప్రకటి స్తున్నారు.. అని చర్చ పెడతారు. దానికంటే కచ్చితంగా విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం’. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement