
హీరో ఉదయ్ కిరణ్‌ను కస్టడీకి ఇవ్వండి
హైదరాబాద్: 'ఫేస్ బుక్' సినిమా హీరో యువనటుడు నేమూరి ఉదయ్ కిరణ్‌ను రెండ్రోజులు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటలో ఓవర్ ద మూన్ పబ్‌లోకి అనుమతించడం లేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి పబ్‌లోకి వెళ్లి .. నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్ అరెస్టైన విషయం తెలిసిందే.
ఈ నెల 23వ తేదీన రాత్రి ఓవర్ ద మూన్ పబ్‌కి వచ్చిన ఉదయ్‌కిరణ్‌ను గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు ఎత్తివేసి భీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్ లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో రిమాండ్‌కు తరలించిన ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు తమ కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.