‘సాక్షి’ కథనంపై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్న పోస్టులు మినహాయించి మిగతా పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,350 పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈనెల 1న సాక్షిలో ప్రచురితమైన ‘కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తేలేనా?’ అన్న కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. దీనిపై అధికారులతో మాట్లాడారు. క్రమబద్ధీకరణ కుదరదని, జీవో 16ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తెప్పించుకొని చర్చించారు.
కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన, నిరుద్యోగుల ఎదురుచూపుల నేపథ్యంలో ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధానంతో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్న 5,027 పోస్టులను మినహాయించి మిగతా 2,350 పోస్టులను భర్తీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ అధికారులతోపాటు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.
కాలేజీల్లో మిగులు పోస్టుల భర్తీకి కసరత్తు
Published Wed, May 3 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement