భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ పథకానికి వేల కోట్లు చెల్లిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వద్ద రైతురుణాలను మాఫీ చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నకిలీ కంపెనీలను గుర్తించి లైసెన్స్‌లను రద్దు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.