పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బీటెక్ విద్యార్థి తాను మరణిస్తూ తన అవయవాలు దానం చేసి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. నిమ్స్ జీవన్ దాన్ ప్రతినిధుల కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన విజయ్‌కుమార్ (20) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 11న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రగాయాలైన విజయ్‌కుమార్‌ను వెంటనే రాయచూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి 12న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్సపొందుతున్న విజయ్‌కుమార్ 14న బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు నిర్థారించారు. మృతుడి తండ్రి బసవరాజుకు జీవన్ దాన్ ప్రతినిధులు అవయవదానం ఆవశ్యకత వివరించారు. ఆయన ఒప్పుకోవడంతో విజయ్‌కుమార్ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కళ్లు, కాలేయం సేకరించి అవసరమైన వారికి అమర్చారు.