- ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన 2రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ సీట్ల గురించి అభ్యర్థుల నుంచి స్పష్టత తీసుకోవాలని ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలను గురువారం హైకోర్టు ఆదేశించిం ది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
2016-17 విద్యా సంవత్సరానికి ఏపీలో ఎన్టీఆర్ వైద్య విద్యాలయం, తెలంగాణలో డాక్టర్ కాళోజీ నారాయణరావు వైద్య విద్యాలయం మొదటిసారి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పీజీ సీట్లను భర్తీ చేస్తున్నాయి. అభ్యర్థులు 2 రాష్ట్రాల్లో జరిగే కౌన్సెలింగుల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో... మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు పలు సీట్లను బ్లాక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో పలు సీట్లు మిగిలి పోతున్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అపూర్వ మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.వి.సింహాద్రి వాదనలు వినిపించారు. దీంతో సీట్లను బ్లాక్ చేసుకున్న అభ్యర్థుల నుంచి స్పష్టత తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు 2 వర్సిటీల అధికారులను ఆదేశించారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేయడంపై స్పష్టత తీసుకోండి
Published Sun, May 22 2016 4:59 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement
Advertisement