మండుతున్న ఎండలు
► రామగుండం, నల్లగొండల్లో 44 డిగ్రీలకుపైగా నమోదు
► 3వ తేదీ వరకు అక్కడక్కడా వానలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రామగుండంలో 44.6 డి గ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు గరిష్ట, 29.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తేమ శాతం పడిపోవడంతో వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు వచ్చే నెల 3వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వె ల్లడించింది.
వడదెబ్బతో 65 మంది మృతి
వడదెబ్బకు శుక్రవారం 65 మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ లో 22 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్‌లో ముగ్గురు, మహబూబ్‌నగర్‌లో 11 మంది, నిజామాబాద్ , రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్‌లలో)
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 44.6
హన్మకొండ 44.4
నల్లగొండ 44.0
మెదక్ 43.5
భద్రాచలం 43.4
నిజామాబాద్ 43.2
ఖమ్మం 43.0
ఆదిలాబాద్ 42.8
మహబూబ్‌నగర్ 42.3
హైదరాబాద్ 42.0
హకీంపేట 40.1
ఆంధ్రప్రదేశ్
అనంతపురం 44
కడప 43
విజయవాడ 41.6
తిరుపతి 41
విశాఖపట్నం 37