
పటాన్‌చెరు టౌన్: మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పోచారం వెళ్లే దారిలో ఉన్న వాణి వెంచర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి 12 ప్లాట్లు (3,600 గజాల స్థలం) కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ సంగారెడ్డికి చెందిన మహ్మద్ నజీం అలియాస్ అజ్జూబాయ్, రామచంద్రాపురానికి చెందిన మహ్మద్ గౌస్ కలసి కడీలు పాతారు.
దీనిపై ఎంపీ శనివారం పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎంపీ ముత్తంగిలో ఉన్న తన స్థలం వద్ద చేరుకొని కడీలను తీయించి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 1984లో తాను మస్కట్‌లో ఉండగా ప్లాట్లు కొన్నా నని, దీన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment