ఈ ఏడాది మే నెలలో వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్న వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది.
ఎంసెట్, ఈసెట్ జేఎన్‌టీయూ(హెచ్)కే..కాకతీయకు ఐసెట్, లాసెట్
ఉస్మానియాకు ఎడ్‌సెట్, పీజీఈసెట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే నెలలో వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్న వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎప్పటిలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)తో పాటు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు పాలిటెక్నిక్ విద్యార్థులకు నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (ఈసెట్)ను జేఎన్‌టీయూ(హెచ్) నిర్వహిస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ను కాకతీయ వర్సిటీ నిర్వహిస్తుంది.