- 9 వేల డిశ్చార్జి సామర్థ్యానికి తేవాలని సీఎం ఆదేశం
- కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీకి ఒక టీఎంసీ నీటి తరలింపునకు ఆమోదం
- రూ.1,076 కోట్లతో ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ పరిధిలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చేందుకు వీలుగా కాకతీయ కాల్వలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాకతీయ కాల్వలను పూర్తి స్థాయి డిశ్చార్జి సామర్థ్యానికి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారు. దీంతో కాల్వ బెడ్‌ను అర మీటర్ పెంచాలన్న నీటి పారుదల నిపుణుల కమిటీ సూచనకు ఆమోదం దక్కినట్లైంది. కాకతీయ కాల్వల పూర్తి ప్రవాహ సామర్థ్యం 9వేల క్యూసెక్కులు కాగా అందులో 50 శాతం కూడా ప్రవాహం ఉండటం లేదు. దీంతో కాకతీయ ప్రధాన కాల్వ లోయర్ మానేరు డ్యామ్ కింద ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2లోని 8.63 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోతోంది. గత ఏడాది స్వల్ప మరమ్మతులు చేయడంతో 5వేల క్యూసెక్కుల వరకు గరిష్ట ప్రవాహం సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించ గా, కాల్వ బెడ్‌ను 0.50 మీటర్ లోతుగా తవ్వితే చాలని, ఇలా తవ్వడం వల్ల 8వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం ఉంటుం దని తెలిపింది. నీటిపారుదల శాఖ అధికా రులతో సోమవారం సమీక్షించిన సీఎం, దీనికి ఓకే చేశారు. కాల్వల సామర్థ్యం పెంపునకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.
రూ.1,076 కోట్లతో లింక్
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కాల్వ (ఎఫ్‌ఎఫ్‌సీ) ద్వారా ఒక టీఎంసీ నీటిని తరలించే ప్రక్రియకు సైతం ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని తరలించేందుకు ఓకే చేశారు. అయితే అధికారులు వేసిన అంచనా ఎక్కువగా ఉండటంతో దాన్ని తగ్గించాలని సూచించగా, ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ కలిపి రూ.70 కోట్ల మేర తొలగించి రూ.1,076 కోట్లతో తుది ప్రణాళిక ఖరారు చేశారు. తొమ్మిది నెలల్లో ఈ లింక్‌ను పూర్తి చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ అంచనాలకు ఆమోదం తెలపాలని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు విన్నవించింది. అక్కడ ఆమోదం దక్కగానే దీనికి టెండర్‌లు పిలవనున్నారు.
కాకతీయ కాల్వల సామర్థ్యం పెంపు
Published Wed, May 24 2017 2:07 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement