తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'
తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'
Published Sun, Dec 11 2016 5:35 AM | Last Updated on Wed, Aug 15 2018 8:08 PM
హైదరాబాద్: త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్‌లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే టీ-వ్యాలెట్ లోగోను ఆవిష్కరింపజేస్తామన్నారు. టీ-వ్యాలెట్ వినియోగానికి ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని చెప్పారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్‌సెంటర్ ద్వారా టీ-వాలెట్ సేవలు పొందవచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement