మోదీ వ్యాఖ్యలను వక్రీకరించారు
కేసీఆర్‌పై లక్ష్మణ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మోదీ చెప్పిన మాటలు ముస్లిం రిజర్వేషన్లను సమర్ధించినట్లుగా లేవ న్నారు. మతం పేరుతో రిజర్వేషన్లు కల్పించ డం మంచిదికాదన్నారు. కేసీఆర్ తన పత నానికి తానే గొయ్యి తవ్వుకుంటున్నారన్నా రు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మతపరమైన రిజర్వేషన్లపై బీసీలను ఐక్యం చేసి తాడోపేడో తేల్చుకుం టామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి నిరస నగా ఈ నెల 20న అన్ని మండలాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను 10 శాతా నికి పెంచాలని బీసీ కమిషన్ సూచిస్తే ప్రభు త్వం 12శాతానికి పెంచడంలో ఆంతర్యమే మిటని ప్రశ్నించారు. ఎస్టీలు, ముస్లిం రిజర్వే షన్లను ఒకే బిల్లులో చేర్చడం వల్ల గిరిజ నులకు అన్యాయం జరిగిందన్నారు. సమగ్ర కుటుంబసర్వే వివరాలను బయట పెట్టాలని,రాష్ట్రంలో సామాజికవర్గాలవారీగా జనాభాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వచ్చే నెలలో అమిత్‌షా పర్యటన
మే 23, 24, 25 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వస్తు న్నట్లు లక్ష్మణ్ తెలిపారు. సంగారెడ్డిలో జరగ నున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు.
కేసీఆర్‌వి మత రాజకీయాలు: పేరాల
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మతరాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు విమర్శించారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారన్నారు. సోమ వారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లా డుతూ బ్రిటిష్‌వారిలా కేసీఆర్ విభజించు, పాలించు విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ విరుద్దంగా ముస్లిం రిజర్వేషన్ల బిల్లు పెట్టారని, దీని ద్వారా దేశంలో విభజన బీజాన్ని కేసీఆర్ నాటుతున్నారని ఆరోపించారు, ఇది దేశ విభనకు, ఉగ్రవాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మత, కుల రాజకీయాలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, ఈ సమస్యతో కేసీఆర్ పతనం కావడం ఖాయమన్నారు.