సింహం సింగిల్‌గా వస్తుంది | Minister KTR comments about TRS strength | Sakshi
Sakshi News home page

సింహం సింగిల్‌గా వస్తుంది

Published Thu, Aug 10 2017 2:22 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సింహం సింగిల్‌గా వస్తుంది - Sakshi

సింహం సింగిల్‌గా వస్తుంది

విపక్షాలన్నీ ఏకమైనా టీఆర్‌ఎస్‌ బలం తగ్గదు: కేటీఆర్‌  
- 2029 వరకు కేసీఆరే ముఖ్యమంత్రి  
హరీశ్‌రావుతో ఎలాంటి పొరపొచ్చాలు లేవు

సాక్షి, హైదరాబాద్‌: విపక్షాలన్నీ ఏకమైనా టీఆర్‌ఎస్‌ బలం ఏమీ తగ్గదని.. సింహం సింగిల్‌గా వస్తుందని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ప్రతి పక్షాలన్నీ ఒక్కటవుతాయనుకుంటే అది తమకున్న బలానికి సంకేత మన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరుల తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు, బావ హరీశ్‌రావుకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. భవిష్యత్తులో రావని చెప్పారు. హరీశ్‌రావు తన కంటే ఎక్కువగా నియోజ కవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని.. ఆదివారాలు కూడా సిద్దిపేటకు వెళ్తారని ప్రశంసించారు.

ఆదివారం రోజైనా విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించి నా హరీశ్‌ పట్టించుకోవడం లేదని చెప్పారు. తమ ఇద్దరి కంటే సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని.. 2029 వరకు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉంటారన్నారు. అయితే తన కుమారు డు లావుగా ఉన్నాడని విమర్శిస్తున్నారని.. చిన్న పిల్లాడిని అలా తిడుతుంటే.. ఎందుకు ఈ రాజకీయాల్లో ఉన్నామా అని బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
బీజేపీతో మా ఎమ్మెల్యేలెవరూ టచ్‌లో లేరు
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలెవరూ కూడా బీజేపీతో టచ్‌లో లేరని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడున్న 5 ఎమ్మెల్యే స్థానాలను నిలబెట్టుకుంటే గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. బీజేపీ బలపడడానికి అవకాశాలు లేవని, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు అంత సీన్‌ లేదని న్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రాదని భావిం చినప్పుడే ఎమ్మెల్యేలెవరైనా బయటికి వెళతారని... వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమనే దానిపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిలకు సైతం అనుమానం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నగర పరిధిలోని మెజారిటీ సీట్లను తమ పారీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ సమాచారాన్ని డిజిటలైజ్‌ చేశామని.. ఒకేసారి 75 లక్షల మంది కార్యకర్తలకు ఎస్సెమ్మెస్‌లు పంపే వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు.
 
జీఎస్టీ తగ్గించకుంటే కోర్టుకు వెళ్తాం..
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై విధించిన 18 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను కేంద్ర ప్రభుత్వం తగ్గించ కపోతే కోర్టులకు వెళతామని కేటీఆర్‌ చెప్పారు. జీఎస్టీ మంచిదేననే ఉద్దేశంతో తాము మద్దతు ఇచ్చామని... ఒక్కో అంశంపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో కేంద్రం చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని... ప్రభుత్వం చేసే ఈ పనులపై 18 శాతం జీఎస్టీ ఎవరు కట్టాలని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 9న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగనుందని.. అప్పుడు కూడా తగ్గింపు నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఇప్పటివరకు జీఎస్టీపై ఏ రాష్ట్రం కూడా కోర్టుకు వెళ్లలేదని.. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే అలా వెళ్లే  రాష్ట్రం తెలంగాణే అవుతుందన్నారు.
 
పోలీసులపై చర్యలు తీసుకుంటాం
సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితు లపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిం చిన ఘట నపై డీఐజీతో విచారణ జరిపిస్తున్నా మని.. నివేదిక వచ్చాక బా ధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుం టామని కేటీఆర్‌ వెల్ల డించారు. ఈ ఘటనలో పోలీసుల అత్యుత్సాహం ఉందని, బాధి తులను చూశాక ఎవరికైనా ఇది స్పష్టంగా తెలుస్తుం దన్నారు. ఈ ఘట న వెనుక దళిత కోణమేదీ లేదని.. బాధితులు పోలీసులపైనే ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. రోజుకో ప్రతిపక్షం నేరెళ్లకు వచ్చి వెళ్తున్నదనే.. తాను ఆలస్యంగా బాధితులను పరమర్శించానని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినన్ని రోజులు సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని తెలిపారు.
 
హిమాన్షు మోటార్స్, స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ వివాదాలపై..
ట్రాక్టర్ల వ్యాపారం కోసం తన స్నేహితుడు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత అచ్చ విద్యాసాగర్‌లతో కలసి 2004లో ఏర్పాటు చేసిన హిమాన్షు మోటార్స్‌ కంపెనీ 2009 నుంచి నష్టాల్లో ఉందని.. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఆ కంపెనీ కార్యకలాపాలు బంద్‌ అయ్యాయని కేటీఆర్‌ వెల్లడించారు. పోలీసు శాఖ కోసం కొనుగోలు చేసిన వాహనాల కాంట్రాక్టును నేరుగా టయోటా కంపెనీకే ఇచ్చామని చెప్పారు. వెంకయ్యనాయుడు కుటుంబానికి చెందిన స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌కు చార్జీలను మినహాయించడం కొత్త కాదని.. గతంలో ఇలాంటి ట్రస్టులకు మినహాయింపులు ఇచ్చారని... బసవతారకం ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని కేన్సర్‌ ఆస్పత్రి సైతం అలా మినహాయింపు పొందిందని పేర్కొన్నారు.
 
నవంబర్‌లో మెట్రో రైలు ప్రారంభం
ఈ ఏడాది నవంబర్‌ చివరి లోగా నాగోల్, మియాపూర్‌ మెట్రోరైలు కారిడార్ల పనులు పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ప్రధానిని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించా రని చెప్పారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సుతో పాటు మరో రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు మోదీ రావాల్సి ఉందని.. ఆ తేదీ ఖరారైతే మెట్రో  ప్రారంభోత్సవం నిర్వహి స్తామన్నారు.  త్వరలోనే తెలంగాణకు ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రానుందని వెల్లడించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement