
లోకేశ్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత కే తారకరామారావు, టీడీపీ నేత నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత కే తారకరామారావు, టీడీపీ నేత నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఈ ఇద్దరు సీఎం తనయులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఇద్దరు నాయకులు వాగ్బాణాలు సంధించుకున్నారు. గ్రేటర్ ప్రచారంలో ఉండగా అనుసూయ అనే మహిళ తన వాహనానికి అడ్డుపడిందని, తాను కేటీఆర్ అనుకొని.. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిందని.. ఆమె ఫొటోతోపాటు లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు.
దీనికి దీటుగా స్పందించిన కేటీఆర్.. ఇప్పటికైనా అధికారంలో ఉన్న తామే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వగలమని గుర్తించినందుకు కృతజ్ఞతలు అంటూ లోకేశ్‌కు థాంక్స్ చెప్పారు. అనసూయ లాంటి పేదవారినందరినీ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గ్రేటర్ ప్రచారంలో ఉన్న లోకేశ్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన పార్టీ విజయం సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
Brother, Glad she understands that it is the state Govt and party in power that can make it happen.Will take care1/2 https://t.co/00pW9Rfcvo
— KTR (@KTRTRS) January 28, 2016
of her and many others like her too. Thanks for bringing it to my attention & good luck with the electioneering. May the better party win2/2
— KTR (@KTRTRS) January 28, 2016