కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్‌ను సింగరేణి యాజమాన్యం ఆమోదించింది.
ఈ మేరకు పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సంస్థ యాజమాన్యం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారుడు డీఎన్ ప్రసాద్, డెరైక్టర్ ఎస్‌డీ అషఫ్, ర వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ ఆర్‌ఆర్ మిశ్రా, సింగరేణి డెరైక్టర్లు బి.రమేశ్ కుమార్, ఎ.మనోహర్ రావు, జె.పవిత్రన్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.