ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్ :ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఏవోబీ ఎన్కౌంటర్ను విరసం నేత వరవరరావు తీవ్రంగా ఖండించారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విశాఖలో మాట్లాడుతూ గుర్తించిన మృతదేహాలకు...వారి బంధువులు వచ్చేవరకూ పోస్ట్మార్టం నిలుపుదల చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్మార్టం నిర్వహించాలని చంద్రశేఖర్ కోరారు. కాగా మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్లో ఒడిశాకు తరలిస్తున్నారు.