హైదరాబాద్: ఈ నెల 31వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజున జలవిధానంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి విపక్షాలు అంగీకరించటలేదు. సభ బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సభలో చర్చించాలని విపక్షాలు పట్టబడుతున్నాయి.
ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్యేల జీతాల పెంపు, ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ బిల్లు, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ బిల్లు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30న ఉదయం కరవు, హైదరాబాద్‌కు నీటి సరఫరాపై చర్చ జరుపనున్నారు.
31న జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
Published Sun, Mar 27 2016 3:51 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement