
రేపట్నుంచి నెలాఖరు వరకు నగరంలో రాష్ట్రపతి విడిది
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు (గురువారం) హైదరాబాద్ రానున్నారు. ఆయన శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెలాఖరు వరకు హైదరాబాద్లోనే ఉంటారు. కాగా, ఈ మధ్య కాలంలో ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.
ఈనెల 23వ తేదీన అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొంటారు. అలాగే 24వ తేదీన రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుకు హాజరవుతారు. ఈనెల 31వ తేదీన ఆయన తిరిగి ఇక్కడినుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.