తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. రాష్ట్రవ్యాప్తం గా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరో 2 రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. రాష్ట్రవ్యాప్తం గా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థి తి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల కారణం గా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ముథోల్, నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్, రెంజల్, మక్లూర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 7 సెంటీమీటర్లు, ఖానాపూర్, నిజామాబాద్‌లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బాల్కొండ, ధర్‌పల్లి, మోర్తాడ్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, ఎడపల్లి, గాంధారి, జగిత్యాల, నవీపేట్‌లలో 5 సెం.మీ. వర్షం కురిసింది.
మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. పలుప్రాం తాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యధికంగా హన్మకొండలో 37.5 డిగ్రీలు, భద్రాచలంలో 34.2, ఆదిలాబాద్ 33.8, రామగుండం 33.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం కోస్తా తీరం నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఆవరించి ఉంది. దీంతో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయి. అయితే అది అల్పపీడనంగా మారే అవకాశాలు తక్కువని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.