
రన్ ఫర్ కాజ్
ప్రస్తుతం మహిళలను భయపెడుతున్న జబ్బు బ్రెస్ట్ క్యాన్సర్. దీనిపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు నిర్వహించనున్న పింకథాన్ గురించి మంగళవారం కేబీఆర్ పార్క్‌లో అవగాహన కల్పించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్.
ప్రస్తుతం మహిళలను భయపెడుతున్న జబ్బు బ్రెస్ట్ క్యాన్సర్. దీనిపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు నిర్వహించనున్న పింకథాన్ గురించి మంగళవారం కేబీఆర్ పార్క్‌లో అవగాహన కల్పించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. ఈ సందర్భంగా ఆయన మాటలు.. ‘రొమ్ము క్యాన్సర్‌పై హైదరాబాదీల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మార్చి 15న పీపుల్స్‌ప్లాజాలో మా ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ ద్వారా 5 వేల మంది మహిళలతో పింక్‌థాన్ రన్ నిర్వహిస్తున్నాం.
ఈ నడకను సిటీలోనూ విజయవంతం చేసేందుకు వివిధ రంగాల నుంచి ఈ 20 మంది అంబాసిడర్లను ఎంపిక చేశాం. అమ్మాయిలు ఎంతసేపూ బయటి అందం గురించే తాపత్రయపడుతుంటారు.. కానీ శరీరం లోపలి ఆరోగ్యం గురించీ ఆలోచించాలి. అందుకు రన్ తప్పని సరి. రొమ్ము క్యాన్సర్‌పై ఇంకా చైతన్యం రావాలి. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మంచి కాజ్ కోసం చేస్తున్న ఈ రన్‌ను హైదరాబాదీలు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా’
- బంజారాహిల్స్