5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ప్లాంటు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు మండలంలో భారీ సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన పార్కును ఏర్పాటు చేసేందుకు సోలార్ ఎనర్జీ కో-ఆపరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సోలార్ పార్కులో రూ. 600 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు.
మొదటి దశలో 500 మెగావాట్లు, రెండో దశలో మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పార్కు అమలు ఏజెన్సీగా నెడ్‌క్యాప్ వ్యవహరించనుందన్నారు. సోలార్ ప్లాంట్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల(విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు మొదలైనవి)ను ఎస్‌ఈసీఐ అభివృద్ధి చేయనుంది. ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేయనున్నారు.
పాలమూరు జిల్లాలో భారీ సోలార్ పార్కు
Published Sat, Mar 1 2014 12:27 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
Advertisement