- ‘బీఎస్సీ అగ్రికల్చర్’ కోర్సును నిర్వహిస్తున్న 3 వర్సిటీలు
- చర్యలు చేపట్టాలని యూజీసీకి ఉన్నత విద్యామండలి లేఖ
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 3 వర్సిటీలు రాష్ట్రంలో పలు స్టడీ సెంటర్ల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూజీసీ కి లేఖ రాసింది. బీఎస్సీ అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఫిరోజాబాద్‌లోని జేఎస్ వర్సిటీ, రాజస్థాన్‌లోని సింఘానియా వర్సిటీలు రాష్ట్రంలోని 8 స్టడీ సెంటర్ల ద్వారా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయని పేర్కొంది.
యాప్రాల్‌లోని ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, తూముకుంటలోని ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, గ్రీన్‌ల్యాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్‌ఫీల్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, మాగ్జిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్‌ప్లాంట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసర్చ్‌లు ఆ కోర్సును నిర్వహిస్తున్నాయని వివరించింది.
నిబంధనలకు విరుద్ధంగా స్టడీ సెంటర్లు
Published Wed, Jun 21 2017 12:10 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement