వర్గీకరణపై హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే శాసనసభలో తీర్మానం చేయకుండా...
చిక్కడపల్లి: వర్గీకరణపై హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే శాసనసభలో తీర్మానం చేయకుండా... తెలంగాణలో వర్గీకరణ కోసం అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లాలని చెప్పడం పెద్ద డ్రామా అని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. సోమవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం మాదిగలను చంద్రబాబు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
వర్గీకరణ చేస్తామని నమ్మబలికి...తీరా మొండిచేయి చూపారని అన్నారు. ఎర్రబెల్లి, రేవంత్‌లకు చిత్తశుద్ధి ఉంటే ఎ.పి.లో తక్షణమే శాసనసభలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఓయూ ఇన్‌చార్జి అలెగ్జాండర్, ఆదిమల్ల గోవర్ధన్, శ్యాం రావు, కొబ్బరి వెంకట్, కొంగరి శంకర్‌లు పాల్గొన్నారు.