తెలంగాణకు ‘మహా’ అన్యాయం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టుల విషయం లో తెలంగాణకు అన్యాయం చేశాయని చెబుతున్న కేసీఆర్, అసలు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఎందుకు చెప్పడంలేదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ మహారాష్ట్రతో చేసుకు న్న ఒప్పందంవల్ల తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతందన్నారు.గురువారం ఇక్కడి ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర, అప్పటి ఏపీ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులు, బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించి 1975లోనే ఒప్పందాలు చేసుకున్నాయన్నా రు.
దీనిపై అంతర్రాష్ట్ర బోర్డు సమావేశాల్లో పునస్సమీక్షించుకునే అవకాశం ఉందని, కేసీఆర్ తప్పును సరిద్దిద్దుకోవాలన్నారు. రీడిజైనింగ్ వల్ల రాష్ట్రంపై రూ.50వేల కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రజాధనాన్ని కాపాడ డానికి అవసరమైతే కోర్టు తలుపులు తడతామని రేవంత్ చెప్పారు.