తమ సమస్యలు తీర్చకపోతే సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ను ముట్టడిస్తామని దివ్యాంగులు హెచ్చరించారు. చిక్కడ్‌పల్లిలోని ఎంఆర్‌పీడీ కార్యాలయంలో 'వికలాంగ హక్కుల జాతీయ వేదిక' ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ న్యాయమైన హక్కులు తీర్చాలని డిమాండ్ చేశారు. మెట్రో, హైటెక్ బస్సుల్లో పాసులు అనుమతించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంట నే భర్తీ చేసి, బస్సుస్టేషన్లలో ర్యాంపులు, వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 70 శాతం వైకల్యం ఉన్న వారికి ఎస్‌కార్డ్ సౌకర్యం కల్పించాలని, 40 శాతం వైకల్యం ఉన్న వారందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సు స్టేషన్‌లోని షాపింగ్ మాల్స్‌ను దివ్యాంగులకు కేటాయించాలని కోరుతూ ఎంఆర్‌పీడీ కార్యాలయంలో బస్‌భవన్ ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.