షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులు, అభ్యర్థులకు పోటీపరీక్షల్లో శిక్షణనిచ్చేందుకు కొత్తగా ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో స్టడీసర్కిళ్ల బ్రాంచీలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఎస్సీ అభ్యర్థులకు బ్యాంకింగ్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఈ ఆర్థికసంవత్సరం (2016-17) నుంచే వీటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.90 లక్షలు మంజూరు చేసిందని బుధవారం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా తెలిపారు.
రాష్ట్రంలో మరో మూడు ఎస్సీ స్టడీ సర్కిళ్లు
Published Wed, Jul 6 2016 7:28 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement