
విమలక్క
కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులపై టీయుఎఫ్ కో చైర్పర్సన్ విమలక్క మండిపడ్డారు. పెట్టుబడులను ఆహ్వానించి ఇక్కడి భూములను తాకట్టు పెట్టడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కుమారుడు కె.తారక రామారావు(కేటీఆర్), ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు విదేశాలకు వెళ్లారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరించడమేనా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారని విమలక్క అన్నారు.